FbTelugu

1నుంచి ఒంటిపూట బడులు

అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయన్నారు.

ప్రతిరోజు ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహిస్తారని, ఆ తరువాత మధ్యాహ్న భోజనం అందచేస్తారని మంత్రి వివరించారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని ఆయన కోరారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.