FbTelugu

‘ఉస్మానియా’లో 12 మందికి కరోనా

హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. కళాశాల హాస్టల్ లో ఉంటున్న విద్యార్థుల్లో మొత్తం 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

ఈ విషయాలను మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ వెల్లడించారు. అయితే హాస్టల్ లో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారని.. ఇంకా కొందరి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది.

You might also like