FbTelugu

తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అడ్డుకుంటున్నారు: రేవంత్

* రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంతో తెలకపల్లిలో ఉద్రిక్తత

నాగర్ కర్నూల్: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని అన్నారు. కాంట్రాక్టర్లలో కుమ్మక్కై అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే తమని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.