FbTelugu

మాజీ అధ్యక్షుడి కుక్కకు క్యాన్సర్ కాటు

వాషింగ్టన్: అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు కుక్క బో క్యాన్సర్ తో పోరాడుతూ శనివారం నాడు చనిపోయింది. కుక్క మృతి పట్ల బరాక్ ఒబామా, భార్య మిషెలీ ఒబామా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మా కుటుంబం ఇవాళ ఒక నమ్మకమైన విత్రుడిని, విశ్వసపరుడు అయిన సహచరుడిని కోల్పోయిందని ఒబామా తెలిపారు. ఒక దశాబ్ధానికి పైగా బో మాతోనే గడిపింది. ప్రతి రోజు మంచి, చెడులో మాతో కలిసి ఉంది. గట్టిగా మొరిగేది కాని కరిచేది కాదన్నారు. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో ఎడ్వర్డ్ ఎం.కెన్నడి కీలకంగా వ్యవహరించారు. కెన్నడీ పోర్చుగ్రీస్ వాటర్ డాగ్ జాతికి చెందిన కుక్కను ఒబామాకు కానుకగా ఇచ్చాడు. 2013లో మరో కుక్క దీనికి జత కలిసింది. బో, సన్నీ వైట్ హౌస్, ఆ తరువాత ఒబామా నివాసంలో సందడి చేసివి.

You might also like

Leave A Reply

Your email address will not be published.