FbTelugu

పెరిగిపోతున్న కల్తీ కల్లు బాధితులు

* పూర్తిగా నిలిపివేసిన కల్లు సప్లై
* కల్లు దొరక్క పలువులు వింత చేష్టలు
వికారాబాద్: జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. గడిచిన మూడు రోజుల్లోనే 300 లకు పైగా కల్తీకల్లు బాధితులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కల్తీకల్లు బాధితుల్లో ఇప్పటికే ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు వికారాబాద్ పరిసరాల్లో మూడు రోజులుగా కల్లును పూర్తిగా నిలిపివేశారు. కల్లు దొరక్కపోవడంతో బాధితులు వింత చేష్టలు చేస్తున్నట్టుగా తెలిపారు. కల్తీ కల్లు కేసులో చిట్టిగిద్దె కల్లు డిపో యజమానిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.