FbTelugu

రోజుకు 36మంది..!

ఇటీవల కాలంలో ఆత్మహత్యల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనో.. ఇండియాలోనో కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న కారణాలతోనే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని పిల్లలు, భార్యా భర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు, మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని ప్రేమికులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది ఆత్మహత్యలకు పాల్పడే వారి కారణాలు చూస్తుంటే.

కారణం ఏదైతేనేం మొత్తానికి వీటి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుందట. ఆత్మహత్యకు పాల్పడేవారి సంఖ్య ఎంతగా పెరిగిందో తెలిస్తే అమ్మో అనక మానరు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారట. అంటే రోజుకు 36మంది ఇలా ఆత్మహత్యకు పాల్పడి తమ జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారట. ఇది ఎవరో చెప్పిన మాట కాదండి. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. వీటిని తగ్గించాలంటే సూసైడ్, మెంటల్‌ హెల్త్‌పై అవగాహన కల్పించాలని, మీడియా కూడా ఆత్మహత్య కేసులను సున్నితంగా రిపోర్టు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ఒత్తిడిని తట్టుకునేలా యువతను తీర్చిదిద్దితేనే ఆత్మహత్యల పరంపరకు చెక్‌ పడే అవకాశముందని కూడా సూచించింది. ఆత్మహత్యల సంఖ్య ఇంతగా ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా.. కానీ ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓనే చెప్పింది కాబట్టి నమ్మక తప్పదు మరి.

You might also like