FbTelugu

కోవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. కోవిడ్ మరణాల రేటు కూడా రాష్ట్రంలో చాలా తక్కువగా ఉందని అన్నారు.

కరోనా వ్యాప్తి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.