టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రతిఏటా తీర్మాణం చేస్తారని అన్నారు. 25 ఏండ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్ కు భారతరత్న పేరుతో ఆటపట్టించడం పైనున్న ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేయడమేనని అన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడడం నీచమని అన్నారు.