FbTelugu

కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంచాలి

కేంద్రానికి ఎన్.టి.ఏ.జి.ఐ సిఫారసు
న్యూఢిల్లీ: దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుండడంతో నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఆఫ్ ఇండియా (ఎన్.టి.ఏ.జి.ఐ) పలు సూచనలు చేసింది.

సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెరిగింది. ఇక నుంచి రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని సూచించింది. ఇంతకు ముందు ఫస్ట్ డోసు వేసుకున్న తరువాత 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు వారాలకు మరికొన్ని రాష్ట్రాలలో ఆరు వారాల తరువాత రెండో డోసు ఇస్తునారు. దాన్ని ఇప్పుడు 12 నుంచి 16 వారాలకు పెంచారు. తొలి, రెండో డోసుల మధ్య విరామం ఎక్కువగా ఉంటే సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయంలో వెల్లడైంది. అయితే భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయం లో ఎలాంటి సిఫారసులు చేయలేదు. ఇవే కాకుండా పలు సూచనలు చేసింది.

ఇక నుంచి కరోనా నుంచి కోలుకున్న రోగులకు ఆరు నెలల తరువాత వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చిన తరువాత పాజిటివ్ వస్తే, కోలుకున్న తరువాత 4 నుంచి 8 వారాల మధ్యలో రెండో డోసు ఇవ్వాలి. ప్లాస్మా థెరఫీ చేయించుకుని కోలుకున్న వారికి 12 వారాల తరువాత ఇస్తే మంచిది. పాలిచ్చే తల్లులు ప్రసవం తరువాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. గర్బిణీ స్త్రీలకు వ్యాక్సిన్ ఇచ్చే ముందు లాభ, నష్టాలను తెలియచేయాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.