FbTelugu

ఇక ముగింపు పలికే సమయం వచ్చింది: డబ్ల్యూహెచ్‌ఓ

ఇక ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారికి ముగింపు పలికే సమయం వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో ) చీఫ్ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలు ఇస్తుండడంతో అధనామ్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికన్ కంపెనీ ఫైజర్, జర్మన్ ఫార్మా దిగ్గజం బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌తో పాటు, మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయని ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడంతో కరోనా సంక్షోభం తగ్గే అవకాశం ఉందని, అయితే, వ్యాక్సిన్‌ విషయంలో పేద, మధ్య ఆదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించొద్దని అధనామ్‌ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.