FbTelugu

ఒక్క డోసు ధర వింటే నోటి మాట రాదు!?

వాషింగ్టన్: ప్రపంచంలో నోవార్టిస్ ఫార్మాకు గుర్తింపు ఉంది. అలాంటి ఫార్మా అరుదైన వ్యాధికి మందు తయారు చేస్తున్నది. సాధారణంగా ఒక్క డోసు ఇంజక్షన్ ధర మహా అయితే రూ.లక్ష ఉండవచ్చు అనేది మనం విన్నాం.
కాని ఈ ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేసే ఒక్క డోసు ధర రూ.18.20 కోట్లు మాత్రమే. అదే జొల్జెన్ స్మా ఇంజక్షన్. అది కూడా 5.5 ఎంఎల్ మాత్రమే. స్పైనల్ మాస్కులార్ ఆట్రోపి (ఎస్ఎంఏ) వ్యాధి చిన్నారుల్లో అరుదుగా కన్పిస్తుంది.

వంద కోట్ల మందిలో ఒకరికి ఈ వ్యాధి పుట్టుకతో వస్తుంది. ఇది సోకిన చిన్నారుల కండరాలు బలహీన పడి పక్షవాతం మాదిరి కదల్లేకపోతారు. ఎన్ని మందులు వాడినా తగ్గుముఖం పట్టదు. ఖరీదైన వైద్యం కావడంతో చిన్నారులు బాధలు అనుభవించి చివరకు తనువు చాలిస్తుంటారు. ఇలాంటి ఘోరమైన వ్యాధిని నియంత్రించేందుకు నోవార్టిస్ జోల్జెన్ స్మా ఇంజక్షన్ ను తయారు చేసింది.
రూ.18.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినా ఈ ఇంజక్షన్ వ్యాధిని పూర్తిగా నయం చేయదు కాని నియంత్రించగలదు. వ్యాధి పెరగకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఇది వేసిన తరువాత వెంటిలేటర్ అవసరం లేకుండా గాలి పీల్చుకోగలుగుతారు. నెమ్మదిగా నడుస్తారు, కూర్చుంటారు. ఇండియాలో ముంబయికి చెందిన దంపతుల కుమారుడికి ఇదేరకమైన వ్యాధి రాగా ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి నిధులు సేకరించింది. సేకరించిన నిధులతో జొల్జెన్ స్మా ఇంజక్షన్ ఒక్క డోసు తెప్పించి వేయించిన తరువాత చిన్నారి కోలుకున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.