FbTelugu

ఇంటింటికి వ్యాక్సిన్ పై కేంద్రానికి నోటీసులు

ముంబయి: ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంపై తన వైఖరిని అఫిడవిట్ రూపంలో తెలపాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇళ్లకు వెళ్లి వ్యాక్సినేషన్ చేయడంపై ఏప్రిల్ 22వ తేదీన కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఇప్పటికి మూడు వారాలు గడిచినా కేంద్రం తన నిర్ణయాన్ని తెలియచేయలేదని మండిపడింది.

మే 19వ తేదీ నాటికి అఫిడవిట్ ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 75 సంవత్సరాలు పైబడిన వారికి, మంచానికే పరిమితం అయిన వారికి, దివ్యాంగులకు, వీల్ చైర్ లో తిరిగే వారికి ఇంటింటికి ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై విచారించారు. వయో వృద్ధుల జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, వారు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లలేనప్పుడు వారి ఇళ్ల వద్దకే వెల్లి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు ఎందుకు చేపట్టలేదని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్.కులకర్ణి బెంచి ప్రశ్నించింది.
ఇలా వెళ్లి ఇవ్వడం మూలంగా చాలా మంది ప్రముఖులతో సహా అనేక మంది ప్రాణాలు కాపాడగలిగేవారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కొంతకాలం క్రితమే చేపట్టి ఉండవల్సిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.