FbTelugu

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు

అమరావతి: ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

ఈ కేసు విషయంలో దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్లుండిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

You might also like