FbTelugu

ఆన్ లైన్ క్లాసులపై సీబీఎస్ఈ కు నోటీసులు

హైదరాబాద్: విద్యార్థులకు ఆన్ లైన్ బోధనపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఎస్ఈ ను ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణ ను 27వ తేదీకి వాయిదా వేసింది.

ప్రైవేటు పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, డిస్టాన్స్ లేదా ఆన్ లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని ఆయన హైకోర్టుకు తెలిపారు.

కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయని హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్ లైన్ లో ఎలా ఉండగలరు? అని హైకోర్టు ప్రశ్నించారు. దీనివల్ల పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన విధివిధానాలు కూడా ప్రకటిస్తామని స్పెషల్ జీపీ తెలిపారు.

ఫీజులు వసూలు చేయవద్దని జారీ చేసిన జీఓను జీఓను పాఠాశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ తెలిపారు. ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని హైకోర్టు తెలిపింది. ఆన్ లైన్ తరగతులపై వైఖరి వెల్లడించేందుకు సీబీఎస్ఈ మరికొంత సమయం కోరింది.

పేరెంట్స్ నుంచి విడివిడగా పిటీషన్లను తీసుకోవడం సాధ్యం కాదని, అలా చేస్తే వందల సంఖ్యలో పిటీషన్లు దాఖలవుతాయని హైకోర్టు తెలిపింది. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేష్ తరఫున తమ వినతులు అందచేయవచ్చని హైకోర్టు తెలిపింది.

You might also like