FbTelugu

బీజేపీ ఉపాధ్యక్షునికి నోటీసులు

అమరావతి: కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా నమోదయ్యే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించి అక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఈ తరుణంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చారు. దీంతో పోలీసులు అతన్ని హోం క్వారంటైన్ లో 28 రోజులు ఉండాలంటూ.. అతని ఇంటికి నోటీసులు అంటించారు. అతనికి కరోనా పరీక్షలు చేయాలని, అతడు ఇంట్లో లేని కారణంగానే ఇంటికి అంటించినట్టు పోలీసులు తెలిపారు.

You might also like