FbTelugu

నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై నోటీసులు

హైదరాబాద్: నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. రంగారెడ్డి జిల్లా మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూలుపై విచారించి నివేదిక పంపాలని డీఈఓ ను ఆదేశించింది.
మౌంట్ లిటేరా జీ స్యూలు యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తుందని శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. స్కూలు ఫీజులు తగ్గించుకోవాలని కోరినందుకు ఆన్ లైన్ నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.

You might also like