FbTelugu

రిపోర్టర్ మనోజ్ మృతిపై గాంధీకి నోటీసులు

హైదరాబాద్: టీవీ5 రిపోర్టర్ మనోజ్ యాదవ్ మృతిపై నివేదిక ఇవ్వాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను రాష్ట్ర మానవ హక్కుల కమిసన్ నివేదిక కోరింది.

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిపోర్టర్ మనోజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతిపై పలువురు సామాజిక వేత్తలు, జర్నలిస్టు సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తడం, దానికి బలం చేకూర్చేలా వాట్సప్ చాటింగ్ మేస్సేజ్ లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారాయి.

గాంధీ వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు నోటీసులు జారీ చేసింది. మనోజ్ యాదవ్ మృతిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

You might also like