FbTelugu

విశాఖ ఉక్కుపై సమ్మె నోటీసు

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ఉద్యమం ఉదృతంలో భాగంగా సమ్మె నోటీసు ఇచ్చింది

స్టిల్ ప్లాంట్ అధికారికి సమ్మె నోటీసు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 25 తర్వాత ఏరోజైనా సమ్మెకు దిగాలనే నిర్ణయాన్ని వెల్లడించింది. స్టీలు ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరణ చేస్తున్నామని, ఇందులో మరో ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో వాటాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఈ ప్రకటన తరువాత ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.