FbTelugu

హోదా కాదు సంస్కారానికి సెల్యూట్

 కోహెడ పండ్ల మార్కెట్ లో రాచకొండ కమిషనర్

హైదరాబాద్: కొత్తగా ఏర్పాటవుతున్న పండ్ల మార్కెట్ లో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ రైతు కష్టానికి గౌరవమిచ్చేలా వ్యవహరించారు.

రంగారెడ్డి జిల్లా కోహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రక్షణ చర్యలు పరిశీలించేందుకు ఇవాళ పండ్ల మార్కెట్ లో తనికీ కోసం మహేష్ భగవత్ వచ్చారు.

లోపల ఎక్కడ చూసినా పండ్లు, కాయలు రాశులు పోసి ఉన్నాయి. ఒక చోట మామిడి కాయల రాశులు పోసి ఉండడంతో ఆయనే స్వయంగా తన బూట్లను తీసేసి, చేతబుచ్చుకుని ముందుకు వెళ్లారు. అది కూడా మామిడి కాయలపై పాత పేపర్లు వేయించి వాటి మీదుగా నడిచి వెళ్లడం చూసి రైతులే అవాక్కయ్యారు.

మిగతవారు, సిబ్బంది చెప్పులు ధరించి వెళ్లినా ఆయన మాత్రం వెళ్లలేదు. రైతు కష్టార్జితం అనుకున్నారో, అందరూ తినేవి అనుకున్నారో కానీ తన మృదుస్వభావం, మంచి మనసును ఇలా చాటుకున్నారు.

You might also like