FbTelugu

4 లక్షలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,092 మంది మరణించారు. వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైనే కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసులతో పోటీ పడే విధంగా మరణాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు.

తాజా కేసులతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,22,96,414కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,42,362కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 37,36,648 ఉన్నాయి. తాజాగా 3,86,444 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లగా, మొత్తంగా 1,83,17,404 మంది కోలుకున్నారు. నిన్న శనివారం నాడు 18,65,428 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 30,22,75,471 పరీక్షలు జరిపినట్లు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.