FbTelugu

టీఎస్ ఆర్టీసీని గుర్తించడం లేదు: గడ్కరీ

Not-identifying-TS-RTC-says-Gadkari

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీఎస్ ఆర్టీసీకి గుర్తింపు లేదని, ఏపీఎస్ ఆర్టీసీ ఇంకా విభజించలేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు లేఖ రాసినట్లు తెలిసింది. ఆర్టీసీ విభజనపై అజయ్ కేంద్ర మంత్రి గడ్కరీ కి లేఖ రాయగా పై విధంగా ప్రత్యుత్తరం పంపించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఎపీఎస్ ఆర్టీసీని ఇంకా విభజించలేదని, అలాంటప్పుడు టీఎస్ ఆర్టీసీ కి చట్టబద్దత ఎలా ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారాన్న తెలంగాణ ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

You might also like