FbTelugu

పెన్షన్‌ డబ్బులివ్వలేదని..

కాటికి కాలు చాపుకున్న వృద్ధుడు. ఏ పనీ చేసుకోలేని వయస్సు. అతడికి సర్కారు సాయంగా నిలిచింది. పెన్షన్‌ రూపంలో కొంత మొత్తాన్ని సాయంగా ఇస్తోంది. పండు ముసలివాడైన ఆ తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు మాత్రం అతడికి వచ్చే పెన్షన్‌ డబ్బులపై కన్నేశాడు.

ఆ డబ్బులు ఇవ్వలేదని చివరకు ఆ తండ్రిని మట్టుబెట్టాడు. మానవత్వాన్ని మంటగలిపిన ఘోర సంఘటన బుధవారం అర్ధరాత్రి వికారాబాద్‌ జిల్లాలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన రాములుకు 70 సంవత్సరాలు. అతడికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి పేరు వెంకటయ్య. అతడికి 32 సంవత్సరాలు. అయితే, రాములకు కొన్నాళ్లుగా ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ రెండు వేల రూపాయలు ఇస్తోంది. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని రాములును అతడు కొడుకు వెంకటయ్య అడిగాడు. దీనికి రాములు ఒప్పుకోలేదు. బుధవారం రాత్రి కూడా దీనిపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. దీంతో వెంకటయ్య తన తండ్రి రాములును గొంతు నులిమి చంపేశాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అష్టకష్టాలు పడి కొడుకును సాకి పెద్దవాడిని చేస్తే చివరకు ఆ కొడుకే కాలయముడై తండ్రి ప్రాణాలను తీసుకెళ్లాడని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.