FbTelugu

గ్యాంగ్ వార్ కాదు… ల్యాండ్ వార్…

విజయవాడ: బెజవాడ నగరంలో రెండు విద్యార్థి వర్గాల మధ్య జరిగింది గ్రూప్ వార్ కాదని, ల్యాండ్ వార్ అని పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది.

నగరంలోని యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఈ వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదివారం రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదంగా అంతా భావించారు. అయితే పోలీసులు లోతుగా విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది.

ఒకే స్థలం విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో గొడవ మొదలై, కత్తులు, కర్రలతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంతటి విలువైన ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు ఇరువర్గాలు పథకం రూపొందించుకున్నాయి. రాజీ కుదుర్చుకుందామని రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయి. కాని రాజీ పేరుతో దాడులు చేయాలని రెండు గ్రూపులు ముందే అనుకున్నాయి.

రాజీ పేరుతో వచ్చిన వ్యక్తులు పక్కా ప్లాన్‌తో కత్తులు, కర్రలతో వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇరువర్గాలపై ఐపీసీ సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేసి, క్షతగాత్రుల వివరాలను సేకరిస్తున్నారు. ఇరువర్గాల రాళ్ల దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

You might also like