FbTelugu

పరామర్శించే స్వేచ్ఛ కూడా లేదా ? : రేవంత్

హైదరాబాద్: శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా ? అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

గురువారం రాత్రి శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై.. ఆ ప్రాంత పరిశీలనకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్ కు అంత భయమెందుకని ప్రశ్నించారు. దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.

You might also like