FbTelugu

కలానికి కాదు… కులానికి సంకెళ్లు వేశాం…

Not-Curbing-press-freedom

అమరావతి: కలానికి సంకెళ్లు… పత్రికా స్వేచ్చకు కళ్లెం అని రెండు రోజులుగా ఆకర్షణీయమైన హెడ్డింగ్స్ చూస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్ని నానీ అన్నారు. కేంద్ర చట్టాల ప్రకారమే పత్రికల నియంత్రణ ఉంటుందని, పత్రికల్లో ఏ వార్త ఎక్కడ రాయాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నారు. 19 (A) ప్రకారం రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్ట్ ల స్వేచ్ఛకు వచ్చిన ముప్పు ఏమి లేదని కొట్టి పారేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కాదని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్ధేశాలతో ప్రభుత్వం పై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి స్పందనను ప్రచురించాలని జీఓ చెబుతోందన్నారు. సంబంధిత శాఖ కార్యదర్శి తన వివరణ ప్రచురించకపోతే న్యాయస్థానం ఆశ్రయించేందుకు అనుమతించామన్నారు. రిజాయిండర్ ఇచ్చినా ప్రచురించకపోతే ప్రభుత్వం ఏమి చేయాలి అని ప్రశ్నించారు. రాష్ట్రం లోని పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతులన్న భావనలో ఉన్నాయి. దేశంలోని మీడియా వేరు రాష్ట్రంలోని మీడియా వేరని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మీడియాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయన్నారు. కొన్ని మీడియా సంస్థలు దురుద్ధేశపూరితంగా వార్తలు రాసి రిజాయిండర్ ఇస్తే వాటిని ప్రచురించకపోతే ఏమి చేయాలో మీరే చెప్పాలన్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, కలానికి సంకెళ్లు కాదు కులానికి సంకెళ్లు అనే భావనలో పత్రికాధిపతులు ఉన్నారు. ఏళ్ల కాలం తమ కులమే రాజ్యం చేయాలనే భవనలో మీడియా యజమానులు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలులో అప్పటి ఆర్టీసీ ఎం.డి సురేంద్రబాబు సహకరించలేదని ప్రభుత్వం బదిలీ చేసారని తప్పుడు వార్త రాసారు. తప్పుడు వార్తపై రవాణా శాఖ కార్యదర్శి, సురేంద్ర బాబులు రిజాయిండర్ ఇచ్చినా ప్రచురించ లేదన్నారు. తప్పుడు వార్తలు కావాలని రాస్తే కోర్టు లకు వెళ్ళాలని సంబంధిత శాఖ కార్యదర్శులను అనుమతించామన్నారు. కాలానికి సంకెళ్లు కాదు కులానికి…తప్పుడు వార్తలు రాసే వారికి సంకెళ్లు వేస్తారని ఆయన హెచ్చరించారు. నీతి నిజాయితీ ఉన్న పత్రికలు.. జర్నలిస్ట్ లకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. మా కులమే ఉండాలి… చంద్రబాబు శాశ్విత సీఎం గా ఉండాలనే వారికే సంకెళ్లు పడతాయన్నారు.

You might also like