FbTelugu

కళ్యాణం వల్లే లైవ్ ప్రసారం చేయలేదు: టీటీడీ

తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం (లైవ్) కారణంగానే అయోధ్య లో శ్రీ రామ మందిర నిర్మాణం భూమి పూజ ఎస్వీ బీసీ లో లైవ్ ఇవ్వలేదని టీటీడీ ప్రకటించింది.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించిన రోజు నుంచి స్వామి వారి నిత్య కళ్యాణం నిరంతరాయంగా లైవ్ ఇస్తూనే ఉన్నామని తెలిపింది. స్వామి వారి కల్యాణాన్ని ప్రతిరోజూ కోట్లాది మంది భక్తులు చూస్తారు. తిరుమలలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో బుధవారం నాడు కుప్పా శివ సుబ్రమణ్యం అవధాని అయోధ్యలో జరగనున్న రామ మందిర భూమి పూజ గురించి మాట్లాడారు. రామమందిర నిర్మాణం భూమి పూజ 12.44 గంటల సమయంలో నిర్ణయించారు.

ఆసమయంలో శ్రీ వారి కళ్యాణం లైవ్ ఇవ్వాల్సి ఉన్నందున అయోధ్య కార్యక్రమం ఇవ్వలేక పోయారు. భూమి పూజ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి యానిమేషన్ తో గురువారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఎస్వీ బీసీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది.

You might also like