FbTelugu

ప్రజలందరికీ వ్యాక్సిన్ అవసరంలేదు: బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రాసిలియా: కరోనా వైరస్ నియంత్రణకు దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో సంచలన ప్రకటన చేశారు. వ్యాక్సిన్లు వచ్చినా వాటిని వేసుకోనని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశంగా బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. వ్యాక్సిన్ వద్దనుకోవడం నా హక్కు అని, వినియోగించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జూలై నెలలో ఆయన కరోనా బారిన పడి చికిత్స చేయించుకున్నారు. అయినా దానికి ఏమాత్రం భయపడడం లేదు. వైరస్ ను నియంత్రించడంలో మాస్కులు, శానిటైజర్లు అంతగా పనిచేయడం లేదని వ్యాఖ్యానించడం కలకలం రేపుతున్నది. అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నాయని బోల్సొనారో పేర్కొనడం గమనార్హం. అయితే తన పెంపుడు కుక్కకు మాత్రం వ్యాక్సిన్ వేయాలని చెప్పడం పై పలువురు నవ్వుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.