FbTelugu

చైనాలో తొమ్మిది మందిని బలిగొన్న న్యూడిల్స్

బీజింగ్‌: న్యూడిల్స్ అనగానే లొట్టలేసుకని తినే వారికి పిడుగు లాంటి వార్త ఒకటి కలవర పెడుతోంది. చైనాలో న్యూడిల్స్ తిన్న వారిలో తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.

వివరాల్లోకెళితే.. చైనాలోని హిలాంగ్జియాంగ్‌లో ప్రీజర్‌లో నిల్వచేసిన నూడిల్స్‌ను తిన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఎక్కువ కాలం ఫ్రీజర్ లో నిల్వ ఉంచడంతో న్యూడిల్స్ విషతుల్యం అయినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. చైనా ప్రభుత్వం ఇప్పటికే నిల్వ ఉంచిన న్యూడిల్స్ తినవద్దంటూ ప్రజలకు సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.