FbTelugu

దిగ్విజయ సింగ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. పరువునష్టం కేసుకు విచారణకు హాజరుకాకపోవడంతో వారంట్ జారీ చేశారు.

2016 లో ఒక కార్యక్రమంలో దిగ్విజయ సింగ్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ నేతలపై పలు ఆరోపణలు గుప్పించారు. ఆయన చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక ప్రజా ప్రతినిధుల కోర్టు లో పరువునష్టం పిటీషన్ వేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ బేఖాతర్ చేశాడు. వరుసగా గైర్హాజరు కావడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. అనారోగ్యం కారణంతో ఇవ్వాల్టి విచారణకు రాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరగా, ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణనను మార్చి 8వ తేదీకి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.