FbTelugu

నేడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్

నెల్లూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నేడు వైసిపి , బిజెపి, సిపిఎం పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసిపి అభ్యర్థిగా డాక్టర్  గురుమూర్తి, బిజెపి అభ్యర్థిగా కె.రత్నప్రభ, సిపిఎం తరపున నెల్లూరు యాదగిరి పోటీ చేస్తున్నారు.

నామినేషన్ వేసే ముందుగా భారీ జన సమీకరణ, ర్యాలీలతో జిల్లా కలెక్టరేట్ వద్దకు అభ్యర్ధులు చేరుకోనున్నారు. వైసిపి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి టిటిడి  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,  రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి, కొడాలి నాని, ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరుకానున్నారు. బిజెపి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దియోధర్ పాల్గొననున్నారు. బిజెపి అభ్యర్థి కె.రత్నప్రభ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.