FbTelugu

నోకియా 4జి కీ ప్యాడ్ ఫోన్లు

న్యూఢిల్లీ: నోకియా కీ ప్యాడ్ ఫోన్లు వాడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని నూతన మోడళ్లను మార్కెట్ లోకి ఆవిష్కరించింది. నోకియా 110 4జి, నోకియా 105 4జి పేరుతో వీటిని విడుదల చేసింది.

ఈ రెండు మోడళ్లు వోల్ట్ సాంకేతికతకు సపోర్టు చేస్తాయి. రేడియో ప్రియుల కోసం వైర్ లెస్ సౌకర్యం కల్పించారు. ఎల్ఈడి టార్చి, వెనక భాగంలో కెమెరాను కూడా ఇచ్చారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. మెమరీ స్లాట్ లో 128 జిబి ర్యామ్ సౌకర్యం, 1020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. నోకియా 110 4జి ధర రూ.3,600, 105 4జి ధర రూ.3,100 గా ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.