FbTelugu

ఫెయిల్ అయితే దుష్పరిణామాలు ఘోరం: పీటర్ ఛార్లెస్

సిడ్నీ: రష్యా ప్రభుత్వం తొందరపి తీసుకువస్తున్న స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ పై నోబెల్ గ్రహీత పీటర్ ఛార్లెస్ డోహెర్టీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయకపోతే, భవిష్త్యత్తులో వచ్చే వ్యాక్సిన్ లపై ప్రభావం భయంకరంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రజలు ఏ వ్యాక్సిన్ ను నమ్మె పరిస్థితి ఉండదని, తిరస్కారానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

అయితే రష్యా రూపొందించిన స్పుత్నిక్-వీ లో ఆరోగ్య, భద్రతాపరమైన ప్రతికూలతలు తలెత్తకపోవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ లు సత్వరం అందుబాటులోకి రాని పరిస్థితులు ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన యాంటీ వైరస్ ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేయాలని సూచించారు. చౌక ధరకు వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం భారత్ కు ఉందని, అవి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని పీటర్ ఛార్లెస్ అన్నారు.

You might also like