FbTelugu

ఏడాదిన్నరగా మాటలు, ముచ్చట్లు లేవు: గెహ్లట్

జైపూర్: ఏడాదిన్నర కాలంగా తనతో పార్టీ బహిష్కృత నేత సచిన్ పైలట్ కనీసం మాట్లాడ్డం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బాంబు పేల్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడెప్పుడా అని సీఎం సీటు కోసం కాచుకు కూర్చున్నాడని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వానికి మెజారిటీ సభ్యుల బలం ఉందని అన్నారు. సచిన్ పైలట్ కు కేవలం 15 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఉందన్నారు. తమకు పూర్తి మద్దతున్నా కూలదోసి బీజేపీ అండతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పెషల్ ఆపరేషన్ గ్రూపు నోటీసులు జారీ చేసిందన్నారు. ఒక్క పైలట్ మాత్రమే జారీ చేశారన్న ప్రచారం సరికాదని, అందరికీ జారీ చేశామన్నారు. ఎమ్మెల్యేలతో తొలుత బీజేపీలో చేరాలని పైలట్ భావించారని, వారు వ్యతిరేకించడంతో మిన్నకుండిపోయారన్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు సహకరించకపోవడంతో సొంత పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని గెహ్లట్ ఆరోపించారు.

You might also like