FbTelugu

2021 దాకా వ్యాక్సిన్ రాదు!

ఢిల్లీ: కరోనా నిరోధక టీకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ వివరణ ఇచ్చింది. ఐసీఎంఆర్‌ డెడ్‌లైన్‌పై దుమారం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం తప్పును సరిదిద్దే చర్యలు చేపట్టింది. మానవులపై ట్రయల్స్‌కే తొమ్మిది నెలలు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు

కోవిడ్‌ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది. మరోవైపు, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.
కొవాక్సిన్, జైకోవ్‌-డీ తో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజల్లో గందరగోళం కలిగించవద్దని ఆమె కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.