FbTelugu

వ్యాక్సిన్ తో లైంగిక వాంఛ తగ్గలేదు: పరిశోధకులు

న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ అంటేనే యువకులు, యువతులు, కొందరు మధ్య వయస్సువారు హడలిపోతున్నారు. మాకెందుకు వ్యాక్సిన్ అంటూ తిరస్కరిస్తున్నారు. దీనికంతటికీ ఒకటే కారణం. మగవాళ్లలో వీర్య కణాలు తగ్గుతాయని, ఆడవాళ్లలో లైంగిక వాంఛ ఉండదనే భయం నాటుకుపోయింది.

ఈ అపోహలపై జపాన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మియామి పరిశోధకులు విస్తృత పరిశోధనలు చేశారు. రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏమాత్రం వీర్యకణాలు తగ్గలేదని రుజువైంది. ఇందుకోసం 45 మందిని ఎంపిక చేసి వ్యాక్సిన్ తీసుకున్న తరవాత, వ్యాక్సిన్ తీసుకోక ముందు లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న 21 మంది ఫైజర్, 24 మంది మెడెర్నా వ్యక్సిన్ రెండు డోసులను తీసుకున్నారు. ఈ విషయాలను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు.

ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారు చేసిన వ్యాక్సిన్లే కాదు, ఎడినో వైరస్ వెక్టర్ డోసుల్లోనూ లైంగిక సామర్థ్యం తగ్గేం రసాయనాలు ఏమీ లేవు. ఎడినో వైరస్ తో కోవిషీల్డ్ తయారు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.