FbTelugu

తెలంగాణలో స్ట్రెయిన్ వైరస్ రాలేదు: ఈటల

హైదరాబాద్: బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ అంత భయంకరమైంది కాదని, చంపే గుణం అంతకన్నా లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కు ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందచేస్తున్నామన్నారు. స్ట్రెయిన్ వైరస్ కు చంపే గుణం తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మందికి విస్తరిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారన్నారు.

తెలంగాణలో ఇంకా స్ట్రెయిన్ వైరస్ రాలేదని ఆయన వివరించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత పది నెలలుగా ప్రజల భయంతో బతుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ప్రచార మాధ్యమాలు స్ట్రెయిన్ వైరస్ పై ప్రజలను భయపెట్టవదని ఈటల కోరారు.
మిగతా కాలాలలో పోల్చితే చలికాలంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. మరో నెల రోజుల పాటు ప్రజలు జాగ్రత్త పాటిస్తే ఎండలు వస్తాయని, అప్పుడు కేసులు తగ్గుముఖం పడతాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.