విజయవాడ: లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది
శనివారం హైదరాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులను సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్టు తెలిపారు. ప్రజలను తరలించేందుకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు పై రెండు రోజుల్లో తెలియచేస్తామని ఆర్టీసీ పేర్కొంది. అప్పటి వరకు ఉన్న ప్రాంతాల్లోనే సురక్షితంగా ఉండాలని ప్రయాణీకులను కోరింది.