FbTelugu

ఆరోగ్య సేతులో సైరన్ లేదు: కేంద్రం

ఢిల్లీ: కరోనా వైరస్ రోగి సమీపంలోకి వచ్చినప్పుడు ఆరోగ్య సేతు యాప్ నుంచి సైరన్ వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఇలాంటి వదంతులను నమ్మవద్దని, యాప్ నుంచి ఎలాంటి సైరన్ శబ్దాలు రావని ఖండించింది. కేవలం అలర్ట్ ల ద్వారా వినియోగదారున్ని హెచ్చరిస్తుందని కేంద్రం పేర్కొంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్ వినియోగిస్తున్నారు.

జీపీఎస్, బ్లూ టూత్ ఆధారంగా కరోనా బాధితులు సమీపంలో ఉన్నది లేదని తెలియచేస్తుంది. ఇలా తెలియాలంటే సమీపంలోని కరోనా బాధితుడికి యాప్ ఉండాలన్నారు. రైలు ప్రయాణం చేసేవారు, విమానంలో ప్రయాణించేవారు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ వినియోగించాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే.

You might also like