FbTelugu

కరోనా తగ్గేవరకు నో స్కూల్స్

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గేవరకు పాఠశాలలను ప్రారంభించేది లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని అన్నారు.

గత రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదుపులోనే ఉందన్నారు. స్కూల్స్ ఓపెనింగ్ విషయంపై ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు.

You might also like