FbTelugu

మంత్రాలయంలో మహా రథోత్సవం లేదు…

కర్నూలు: మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలలో భాగంగా నిర్వహించే మహరథోత్సవం ఈ ఏడాది నిర్వహించడం లేదని మఠం అధికారులు ప్రకటించారు.
కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ఆగస్టు 2 నుంచి 8 వరకు జరగాల్సిన సప్తరాత్రోత్సవాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు మఠం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఉత్సవాల్లో పాల్గొనే వారి సంఖ్యను 50 మందికి లోపుగానే పరిమితం చేశారు. శ్రీమఠం ప్రాంగణంలో సంప్రదాయాలను అనుసరించి నిర్వహిస్తున్నారు. భక్తులు, శిష్యులు, భజన మండళ్లు ఈ ఆరాధన ఉత్సవాలను శ్రీ మఠం యూట్యూబ్ ఛానల్ లో చూడవలసిందిగా కోరింది.
మంత్రాలయంలో ఎటువంటి వసతి, దర్శన భాగ్యం లేవని, భక్తులు గమనించి ఎవరి ఇంటి వద్దే వారే ఉండి రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పోందాల మఠం కోరింది.

You might also like