FbTelugu

ట్విట్టర్ లో రాజకీయాలు కుదరవు

No-politics-on-Twitter

శాన్‌ ఫ్రాన్సిస్‌స్కో: సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్విట్టర్ లో ఇక నుంచి రాజకీయ ప్రకటనలు నిషేధిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సే ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియా కమర్షియల్ ప్రకటనలకు శక్తివంతమైన సాధనంగా మారింది. దీన్ని ప్రతి రాజకీయ పార్టీ వినియోగించుకుంటుండడంతో ట్విట్టర్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి పూర్తిగా నిషేధించింది. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాక్ తెలిపారు. నవంబర్ 22 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని, నవంబర్ 15న విధి విధానాలు ప్రకటిస్తామని జాక్ పేర్కొన్నారు.

You might also like