FbTelugu

ఇంత అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ లేదు: శంకర్

హైదరాబాద్: గత 6 సంవత్సరాల్లో కేసీఆర్ సాధించిన అభివృద్ధి ఏ రాష్ట్రానికీ సాధ్య పడలేదని ప్రముఖ సినీ డైరెక్టర్ శంకర్ అన్నారు. అహింస మార్గంలో తెలంగాణ సాధించిన ఘనత కెసిఆర్ దేనని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చారని అన్నారు.

ఒక్కప్పుడు హైదరాబాద్ నీటి సమస్య ఎంత దారుణంగా ఉండేదో అందరికీ తెలుసునన్నారు. ఇక్కడికి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు పటిష్టంగా ఉండటమేనన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యమే వరద నష్టాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గ్రేటర్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.