FbTelugu

ఆర్టీసీలో ఎవరినీ తొలగించలేదు: పెర్నినాని

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లో ఎవరినీ తొలగించలేదని మంత్రి పెర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను విధులకు వాడాలని చెప్పినట్టు తెలిపారు.

అయితే ప్రతిపక్షాలు దీనిపై కూడా బురద జల్లుతున్నాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం వల్లనే జీతాలు చెల్లించలేకపోయామని తెలిపారు. ఎవరినీ తొలగించమని, యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.

You might also like