FbTelugu

చావు కు రాలేదు… దశదిన కర్మకు 150 మంది!

పాట్నా: కరోనా మహమ్మారితో చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ సాయం అందించడం లేదు. కర్మకు కూడా ఎవరూ రావడం లేదు. కాని బిహార్ లో మాత్రం మరోలా జరిగింది.

అరియా జిల్లా బిష్ణుపుర గ్రామంలో బీరేంద్ర సింగ్, ప్రియాంక దేవీ నాలుగు రోజుల వ్యవధిలో కరోనా బారిన పడి చనిపోయారు. వీరిద్దరి అంత్యక్రియలకు రావాల్సిందిగా ఇరుగు పొరుగువారిని, తెలిసిన వారిని పెద్ద కుమార్తె సోని బ్రతిమలాడింది. సోనితో పాటు సోదరుడు నితీష్, సోదరి చాందినీ లు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహించారు. ఈ కర్మకు మాత్రం 150 మంది వచ్చి భోజనం చేశారు. వారిలో కొందరు తల్లిదండ్రుల ట్రీట్ మెంట్ కు డబ్బులు ఇచ్చామని, వాటిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. వారి నుంచి అందినకాడికి గుంజుకుని తీసుకుపోవడం పలువురిని ఆవేదనకు గురి చేసింది.

పెద్ద కుమార్తె సోని మాట్లాడుతూ, తండ్రి, తల్లి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించాలని కోరితే కులంవాళ్లు, గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదన్నారు. కర్మకు మాత్రం 150 మంది వచ్చి భోజనాలు చేశారని, కొందరు అప్పిచ్చామంటూ డబ్బులు లాక్కుని పోయారని సోని ఆవేదనతో చెప్పింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.