FbTelugu

వ్యాక్సిన్ పై అపోహలు వద్దు: సభ పెద్దలు వినతి

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇవాళ నిమ్స్ లో వైద్యుల పర్యవేక్షణలో నర్సులు తొలి డోస్ వేశారు.

ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిందన్నారు. వైరస్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వైరస్ ని కట్టడిచేసుందుకు తెలంగాణలోని భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకా ను కనుక్కోవడం మనందరికి గర్వకారణం అన్నారు. ఈ రోజు నేను, నా భార్య కోవాక్సిన్ టీకా తీసుకోవడం జరిగిందన్నారు. వ్యాక్సిన్ వచ్చింది కదా అని కరోన వైరస్ ని నిర్లక్ష్యం చేయవద్దని, వైరస్ మళ్ళీ విజృంభిస్తుందని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ మూడో దశ మళ్ళీ ప్రారంభం అయ్యిందని, అయిదు రాష్ట్రాల్లో మళ్ళీ కరోన కేసులు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర తో పాటు కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్తితి ఏర్పడిందన్నారు. కరోనా వైరస్ పేరు చెబితేనే గడగడ వణుకుతున్న రోజుల్లో మీడియా సోదరులందరు తమ ప్రాణాలను లెక్కచేయకుండా  వార్తలు సేకరణ చేశారని కితాబునిచ్చారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్యంగా విస్తరించి లక్షల మంది మరణాలకు కారణమైందన్నారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనడంలో అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ తో తెలంగాణ రాష్ట్రంలోని భారత్ బయోటెక్ సంస్థ పోటీపడి విజయం సాధించిందన్నారు. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న కరోనా వ్యాక్సిన్ లలో 60 శాతం తెలంగాణ గడ్డ మీదనే ఉత్పత్తవుతున్నాయన్నారు. అరవై సంవత్సరాలు దాటిన వారి కేటగిరిలో నేను ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకున్నాను. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అపోహలకు పోవద్దని, ఇది అన్ని విదాలుగా క్షేమం అన్నారు. కరోనా మహమ్మారిపై నిత్యం ప్రజలను అప్రమత్తంగా ఉంచతూ అవగాహన కల్పించడంలో క్రీయాశీలంగా వ్యవహరించిన మీడియాకు, పాత్రికేయులను స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.