హైదరాబాద్: సిఎం కెసిఆర్ కావాలనే తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బిజెపి నాయకురాలు విజయశాంతి రెడ్డి ఆరోపించారు. దొర ఎన్ని కేసులు పెట్టినా రాములమ్మ బయపడదని స్పష్టం చేశారు.
ఇవాళ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు విజయ శాంతి రెడ్డి హాజరయ్యారు. 2012లో టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న నాపై సభకు అనుమతి లేదని కేసులు పెట్టారు. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, అందులో భాగంగా ప్రచారం చేయడం జరిగింది. పార్టీ అధినేత అయిన కెసిఆర్ సభలకు అనుమతులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నారు. గడిచిన 9 సంవత్సరాల కాలంగా కెసిఆర్ నాపై కక్ష్యపురిత చర్యలకు పాల్పడుతున్నారు. వీటికి రాములమ్మ భయపడదు.. కోర్టులపై నమ్మకం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని కేసీఆర్.. ఇళ్లలో కూర్చొని ఉద్యమాలు చేశాడని విజయశాంతి రెడ్డి ఆరోపించింది.