FbTelugu

ఇకపై అమెరికాలో శాశ్వత నివాసం కలే

వాషింగ్టన్ : ఇకనుంచి అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే ఇతర దేశీయులకు అవకాశం ఉండక పోవచ్చనే సంకేతాలే వస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా చేశారు. అయితే ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారికి మినహాయింపు ఇస్తున్నారు.

దీంతో ఇకనుంచి అమెరికాకు కొత్తగా వెళ్లేవారు అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని ఉండడానికి అనర్హులుగా అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమెరికాలో సెటిలవ్వాలని కలలు కనే వారి గుండెల్లో పిడుగు పడ్డట్టైంది.

You might also like