అమరావతి: ఇకపై ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగానే ఏపీ ఎక్సైజ్ శాఖ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కి
అదనపు అధికారాలను కల్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలు, డిస్టరీల నిర్వహణకే పరిమితం కానుంది. ఎక్సైజ్ శాఖలో 70 శాతం ఉద్యోగులను ఎస్ఈబీకి బదలాయించారు. దీంతో ఇకనుంచి కేవలం 30 శాతం ఉద్యోగులకే ఎక్సైజ్ శాఖ పరిమితం కానుంది.