FbTelugu

లాక్ డౌన్ విధించం: సిఎం అరవింద్

న్యూఢిల్లీ: దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఆలోచనే లేదని సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ ఊపందుకున్న సమయంలో సిఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వైరస్ విజృంభణ దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్, ఉన్నతాధికారులతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. వైరస్ కేసులు ఎన్ని నమోదు అవుతున్నాయి, బాధితుల పరిస్థితి, హాస్పిటళ్లలో సౌకర్యాలు, నియంత్రణ చర్యలపై అధికారులతో ఆరా తీశారు. కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్నాయని, గడచిన 24 గంటల వ్యవధిలో 3583 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. అయితే నగరంలో ఫోర్త్ వేవ్ నడుస్తోందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులను సిఎం సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని వైద్యులు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సిఎం అరవింద్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.