FbTelugu

హైదరాబాద్ లో కేసులు పెరగొద్దు: కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు పెరగకుండా, వ్యాప్తి చెందకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మూడు నాలుగు రోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. సీఎం  ఆదేశాల మేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ  రావు, హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఈటల సూచించారు.

మలక్ పేట మహబూబ్ గంజ్ లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో మూడు షాపుల యజమానులకు వ్యాపించిందని మంత్రి ఈటల తెలిపారు. వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందన్నారు. వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ ఐసొలేషన్ లో ఉంచామన్నారు. గంజ్, పహడీ షరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నామని ఈటల తెలియజేశారు.

ఈరోజు చనిపోయిన ముగ్గురి వివరాలు

1 : రామంతపూర్ కి చెందిన 48 ఏళ్ల వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయారు. షుగర్, బీపీ, స్థూలకాయం, న్యుమోనియా తో బాధపడుతున్నారు.

2 : వనస్థలిపురం చెందిన 76 ఏళ్ల వ్యక్తి  గుండె, కిడ్నీ, న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ లో చేరిన 24 గంటల్లోనే చనిపోయారు.

3 : జియగూడ దుర్గానగర్ కు చెందిన  44 ఏళ్ల మహిళ నిన్న గాంధీ ఆసుపత్రి కి వెంటిలేటర్ మీదనే వచ్చారు. వచ్చిన 6 గంటల్లోనే మరణించారు. ఈమె కూడా బీపీ, షుగర్, న్యుమోనియా తో బాధ పడుతున్నారు.

You might also like